Balayya the next Superhero: ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ఆయన సపోర్ట్ చేసే పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ప్రస్తుతానికి అయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ గురించి కొంత షాకింగ్ సమాచారం వెలుగులోకి వస్తోంది. బాలయ్య సూపర్‌హీరో పాత్రలో నటించబోతున్నారని వార్తలు తెర మీదకు వచ్చాయి. ఈ సినిమా ఇండియన్ సినిమా గమనాన్నే మార్చే అవకాశముందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ 11న వెలువడనుంది.
S. S. Rajamouli Bday Special : ఓటమి ఎరుగని ధీరునికి ‘ఆస్కార్ సెల్యూట్’
ఈ సినిమా ఇప్పుడు బాలయ్య అభిమానులు- పరిశ్రమ నిపుణులలో ఆసక్తిని పెంచుతోంది. ఇక ప్రాజెక్ట్ గురించి వివరాలు రహస్యంగా ఉన్నాయి, కానీ బాలయ్యను ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా చూపించే ప్రయత్నం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ ఊహాగానాలు పెరిగుతున్న క్రమంలో ఆయన అభిమానులు ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య సూపర్‌హీరో అంటే ఇక బాక్సులు బద్దలు కావాల్సిందే అని అంటున్నారు. నిజానికి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అది కూడా సూపర్ హీరో సినిమా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు బాలయ్య కూడా సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు అనే చర్చ జరగడంతో ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది ఆయన తదుపరి సినిమానా? లేక ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టా? అనే విషయం రేపటికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.