NTV Telugu Site icon

Balayya: వీర సింహం ఒటీటీలో దిగుతుంది…

Balayya

Balayya

నందమూరి నట సింహాన్ని వింటేజ్ ఫ్యాక్షన్ రోల్ లో చూపిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ ‘వీర సింహా రెడ్డి’. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలోని అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫ్యాక్షన్ రోల్ అనగానే బాలయ్య సింహంలా కనిపిస్తూ ఉంటాడు. వైట్ అండ్ వైట్ వేసి బాలయ్య చేసే ఫైట్స్ ని సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో మోతమోగిపోతుంది అనే మాటని నిజం చేస్తూ వీర సింహా రెడ్డి సినిమా వంద కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. నందమూరి ఫాన్స్ ని వింటేజ్ వైబ్స్ ఇచ్చిన ఈ మూవీలో బాలయ్య గెటప్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నట సింహం డైలాగ్స్ చెప్తుంటే థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి.

ఇకపై థియేటర్స్ లో కాదు ఇంట్లో విజిల్స్ వెయ్యండి అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ చేసింది. వీర సింహా రెడ్డి సినిమాని ఒటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఫిబ్రవరి 23 సాయంత్రం ఆరు గంటల నుంచి వీర సింహా రెడ్డి సినిమా స్ట్రీమ్ అవుతుంది అంటూ అనౌన్స్మెంట్ వచ్చేయడంతో ఇంట్లో కూర్చోని బాలయ్య రోరింగ్ పెర్ఫార్మెన్స్ ని చూడడానికి ఫాన్స్ రెడీ అయిపోయారు. ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో #VSRHungamaOnHotstar అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి నందమూరి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. సీమ సింహా వేట షురు అంటూ డిస్నీ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వీర సింహా రెడ్డి సినిమా ఒటీటీలో కూడా అంతే హిట్ అవుతుందేమో చూడాలి.

Show comments