Site icon NTV Telugu

“అన్‌స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!

Balakrishna

ప్రత్యేకమైన తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సూపర్ సక్సెస్ ఫుల్ షోలలో నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” ముందు వరుసలో ఉంటుంది. కానీ షో సూపర్ హిట్ అయింది దాని కంటెంట్ లేదా అతిథుల వల్ల కాదు… బాలయ్య వల్ల, ఆయన స్టైల్, కొంచెం వ్యక్తిగత టచ్‌తో ప్రజెంట్ చేసిన విధానం వల్ల షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ నైపుణ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం… వాస్తవానికి ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా బాలయ్య ఫస్ట్ ఛాయిస్ కాదని, ముందుగా మేకర్స్ మరో ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారని తెలుస్తోంది.

Read Also : “భీమ్లా నాయక్” ప్రీమియర్లు కన్ఫర్మ్… రన్ టైం ఎంతంటే?

ముందుగా సీనియర్ హీరో వెంకటేష్‌ను సంప్రదించారట. ఈ సీనియర్ హీరో తన జోవియల్ నేచర్, లవ్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి పేరుగాంచాడు కాబట్టి అతని రాక ప్రోగ్రామ్‌కు చాలా హైప్ తెస్తుందని షో నిర్వాహకులు భావించారట. కానీ కరోనా మహమ్మారి కారణంగా వెంకీ ఈ షోను హోస్ట్ చేయడానికి నిరాకరించడంతో, నేచురల్ స్టార్ నానిని కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమా కమిట్ మెంట్స్, గత బిగ్ బాస్ అనుభవంతో నాని కాస్త వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. దాంతో టీమ్ చివరకు బాలయ్య వద్దకు వెళ్లింది. బాలయ్య తన హోస్టింగ్ టెక్నిక్ తో చరిత్ర సృష్టించడంతో పాటు షో రేటింగ్స్ పరంగా వెనుదిరిగి చూసే పరిస్థితికి ఆస్కారం లేకుండా చేశారు. బాలయ్యా మజాకా !!

Exit mobile version