Site icon NTV Telugu

Balakrishna: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు.. నాకు చాలా గర్వంగా ఉంది!

Balakrishna Comments On Allu Arjun

Balakrishna Comments On Allu Arjun

Balakrishna says he is feeling proud: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి రిలీజ్ అయినప్పటి నుంచి భారీ ఆదరణ లభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటించినందుకు గాను అల్లు అర్జున్ కి తాజాగా బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అనౌన్స్ చేశారు. 69వ జాతీయ సినిమా పురస్కారాల ప్రకటనల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఇక అల్లు అర్జున్ కి అవార్డు రావడంతో దాదాపు 69 సంవత్సరాలు జాతీయ సినిమా అవార్టుల చరిత్రలో ఒక తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవంగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు వచ్చిన అవార్డు మీద అనేక రకాల ప్రశంసలు లభించగా ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ స్పందించారు.

Gaandeevadhari Arjuna Review: గాండీవధారి అర్జున రివ్యూ

ఎన్టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ అల్లు అర్జున్ కి ఈ అవార్డు లభించడం ఒక నటుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. తమ నట వర్గం అందరికీ ఇది చాలా ఆనందం కలిగించే విషయమని తెలుగు చలనచిత్ర సీమ కూడా గర్వపడాల్సిన సమయం అని అన్నారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు ఆర్ఆర్ఆర్ టీంకి కూడా ఆరు అవార్డులు వచ్చాయంటే అది అంత ఈజీగా జరగలేదని వారి కష్టాన్ని గుర్తించి వారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఉప్పెన టీమ్ కి కూడా ఆయన విషెష్ తెలిపారు.

Exit mobile version