Dassahra Movies : దసరా బరిలో బాలయ్య, చిరు, వెంకీ, నాగ్.. విజయం ఎవరిని వరిస్తుందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో పండుగ సీజన్ వస్తోందంటే చాలు థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ ను వృధా చేసారు స్టార్ హీరోలు. పెద్ది తప్ప మరో పెద్ద సినిమా ఏది రాలేదు. కానీ రాబోయే దసరా పండుగ మాత్రం బాక్సాఫీస్ వద్ద అసలైన టపాసులు పేల్చడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ఒకే రిలీజ్ విండోను టార్గెట్ చేస్తుండటంతో దసరా రేసు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా సంక్రాంతి బరిలో ఇలాంటి భారీ క్లాష్ చూస్తుంటాం. కానీ ఈసారి దసరా నవరాత్రుల సెలవులను క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలంతా క్యూ కట్టారు. ఈ సీనియర్ యంగ్ స్టార్ల చిత్రాలు గనుక ఒకేసారి బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర సంక్రాంతిని మించిన హంగామా ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిల అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లు కూడా ఇదే సీజన్‌ను లీడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ నలుగురు స్టార్ హీరోల సినిమాల్లో ఖచ్చితంగా ఎన్ని చిత్రాలు దసరా బరిలో నిలుస్తాయనేది అధికారిక ప్రకటనలు వస్తే గానీ తెలియదు. ఒకవేళ ముగ్గురు లేదా నలుగురు హీరోలు పోటీలో మిగిలినా, ఈ ఏడాది దసరా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద పండుగ క్లాష్‌గా మారడం ఖాయం.
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!