Site icon NTV Telugu

Bhagavanth Kesari Trailer Launch: వరంగల్ లో అరిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ రావాలే

Bhagavanth Kesari

Bhagavanth Kesari

వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగతవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి… ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. ఇప్పటికే అన్న దిగిండు… ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. టీజర్‌తో టెంపర్ లేచిపోయేలా విజిల్స్ వేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా రాబోతున్నాడు బాలయ్య. అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదిన భగవంత్ కేసరి ట్రైలర్ బ్లాస్ట్‌ జరగబోతుంది.

ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా బాలయ్యని ఒక సరికొత్త యాంగిల్‌లో చూడబోతున్నారు అంటూ తెలిపారు మేకర్స్. ఈ ట్రైలర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. భగవంత్ కేసరి భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 8వ తేదీన, ఆదివారం నాడు హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో వరంగల్ గడ్డపై మాస్ జాతరకు రెడీ అవుతున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. ఇక్కడి నుంచి దసరా వరకు జై బాలయ్య స్లోగాన్ సౌండ్ పెరుగుతునే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టడం గ్యారెంటీ. మరి భగవంత్ కేసరి ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version