Site icon NTV Telugu

Unstoppable: ‘గాడ్ ఆఫ్ మాసెస్’తో వస్తున్న ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’

Nbk Og

Nbk Og

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2 ఎండింగ్ కి వచ్చిన ఈ టాక్ షో కారణంగానే బాలయ్య ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మాస్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉండే బాలయ్యకి ఇప్పుడు అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు అంటే దానికి ఏకైక కారణం ‘అన్ స్టాపబుల్ టాక్ షో’ని బాలయ్య హోస్ట్ చేస్తున్న విధానమే. యంగ్ హీరో, స్టార్ హీరో అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరినీ తనతో కలుపుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 2 ఎండింగ్ లో వచ్చింది ప్రభాస్, గోపీచంద్, అడివి శేష్, విశ్వక్ సేన్, శర్వానంద్, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి హీరోలతో జోష్ ఫుల్ గా సాగిన ఈ సీజన్ 2కి గ్రాండ్ క్లోజింగ్ ఇవ్వడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించారు.

Read Also: Rajamouli: నేను దేవుడుని కలిసాను…

పవన్ కళ్యాణ్, బాలయ్యలు ఒక్క క్షణం అలా కలిసి కనిపిస్తేనే అదో సెన్సేషన్ అవుతుంది అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒక ఎపిసోడ్ నే చేశారు అంటే ఇక సోషల్ మీడియా ఏమైపోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 2 క్లోజింగ్ ఎపిసోడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఎపిసోడ్ ని త్వరలో రిలీజ్ చెయ్యబోతున్నాం అంటూ ‘ఆహా’ అఫీషియల్ ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేశారు. జనవరి 26న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరున్న బాలయ్య, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పేరున్న పవన్ కళ్యాణ్ లు కలిసి ఎలాంటి సెన్సేషనల్ ఎపిసోడ్ ని ఆడియన్స్ కి ఇస్తారో? ఈ కలయిక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో? ఆంధ్రాలో సినిమాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో చూడాలి.

Exit mobile version