NBK112: కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా.. బాలయ్య కోసం 20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK112: ఒక స్టార్ హీరో, కమర్షియల్ దర్శకుడు చేతులు కలిపితే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ వంటి మాస్ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లడంతో సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా NBK112 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌పై ఆసక్తికర సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. సమాచారం ప్రకారం ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రధానంగా బాలకృష్ణపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసమే దాదాపు 20 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు విజువల్‌గా కూడా షెడ్యూల్ ను గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారని సమాచారం.
కొరటాల శివ సినిమాల ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి చిత్రంలో ఒక బలమైన సోషల్ కాన్సెప్ట్ తోనే ముందుకు వస్తున్నారు. అదే ఫార్ములాను ఈ చిత్రంలో కూడా కొనసాగిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలకృష్ణ పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతోందట. ముఖ్యంగా ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంతో సాగుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలు ప్రస్తుతం ఊహాగానాలుగానే మిగిలాయి.
Also Read
మరోవైపు మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే ఈసారి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సెంటిమెంట్ కు కూడా పెద్దపీట వేసేలా కథను సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, స్క్రిప్ట్ విషయంలో చాలా సమయం తీసుకుని పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ కథనం, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కలిసొస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కథ, పాత్రల నేపథ్యంపై వస్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే చిత్రబృందం నుంచి అధికారిక అప్డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?