NTV Telugu Site icon

 Balakrishna: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా

Mm

Mm

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.ఈసారి పండక్కి కూడా బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్, సచిన్ ఖేడ్, షేన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించగా. తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది.

మంచి విజువ‌ల్స్‌తో మొద‌ల‌య్యే ఈ చిత్రం మొదటి నుంచే ఆడియెన్స్​ను లీనమయ్యేలా చేసింది.లోక‌ల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు, తన త‌మ్ముడి నేపథ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. కథలో పెద్దగా ట్విస్ట్ లు లేనప్పటికి ప్రజెంటేషన్ మాత్రం అదిరిపోయిందట. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  

ఇక తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా ఈమూవీ డిజిటల్ హక్కుల కోసం  నెట్ ఫ్లిక్స్  ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది. నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందట. సితార నిర్మాతలు స్పందిస్తే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.  ఎందుకంటే సితార నిర్మాతలు తమ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ మూవీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు విక్రయిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో సైతం హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments