Site icon NTV Telugu

ఆహా అనిపిస్తున్న ‘అన్ స్టాపబుల్’ .. ఈసారి న్యాచురల్ స్టార్ తో బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఆహా కోసం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో మొదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ స్టార్ రాబోతున్నాడు.. వారిని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నాడు అనే డైలమాకు తెర వీడింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని సందడి చేయనున్నాడు.

నాని తో బాలకృష్ణ సెట్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆహా సంస్థ విడుదల చేసింది. “మనలో ఒకడు.. సెల్ఫ్ నేమ్ కి సర్ నేమ్ .. న్యాచురల్ స్టార్ నాని మన నెక్స్ట్ గెస్ట్” అని తెలుపుతూ ఈ ఎపిసోడ్ ప్రోమోను ఈ రోజు 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రోమో కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రంలో నాని బాలయ్య డై హార్ట్ ఫ్యాన్ గా కనిపించి మెప్పించాడు. మరి ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్ నిజం చేస్తోంది ఈ షో.. మరి నానితో బాలయ్య ఎలాంటి నిజాలను బయటపెట్టిస్తాడో చూడాలి.

Exit mobile version