Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఒంగోలు లో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మొదట తండ్రి ఎన్టీఆర్ శతదినోత్సవం కావడంతో ఆయనను తలుచుకున్నారు. ఆయన లేనిది తాను లేనని తెలిపాడు. విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత తల్లిదండ్రుల గురించి, స్నేహితుల గురించి శ్లోకాలు చెప్పి వివరించిన బాలయ్య.. ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇక బాలయ్యకు ఎన్నో హిట్లు అందించిన దర్శకుడు బి గోపాల్ కు తప్ప వీరసింహా రెడ్డి కి పెద్ద గెస్ట్ గా వచ్చే హక్కు ఎవరికి లేదని చెప్పాడు. బి.గోపాల్ తో ఆయనకున్న అనుబంధాన్ని చెప్పిన బాలకృష్ణ ఆయన తనకు కుటుంబ సభ్యుడిలా అని చెప్పుకొచ్చారు. అభిమానం అంటే డబ్బుతో కొనేది కాదని, కొన్ని ప్రలోభాలకు లోను కానిది అభిమానం.. ఆ అభిమానం తనకు ఉందని అన్నాడు. గోపీచంద్ మలినేని లాంటి అభిమాని ఈ సినిమా తీయడం ఎంతో ఆనందంగా ఉందని.. ముత్యాలు ఏటవాలుగా దొర్లుతుంటే ఎంత అందంగా ఉంటాయో.. ప్రతి నటీనటులు నుంచి కూడా నటనను అలా తీసి ఒక అందమైన సినిమాగా తీసాడని చెప్పుకొచ్చాడు. ఇక మధ్య మధ్యలో సినిమా డైలాగులను వినిపించి అభిమానులను అబ్బురపరిచిన బాలయ్య తన అన్ స్టాపబుల్ షో గురించి చెప్పుకొచ్చాడు. “బాలకృష్ణను ఇంకా దగ్గరగా చూడాలన్న ఆ అభిమానుల కోరిక ఉన్నదో.. రాడులే.. తను రాజకీయాలకు, సినిమాలకే పరిమితంలే.. అనుకున్నవారికి ఆహా ద్వారా అన్ స్టాపబుల్ షో చేసి.. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మ మొగుడై కూర్చుంది అది” అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో నటించినవారి గురించి పేరు పేరునా చెప్పుకొచ్చిన బాలయ్య ప్రతి ఒక్కరు కష్టం సినిమాలో కనిపిస్తుందని తెలిపాడు. సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్ , ఒక వీర సింహారెడ్డి గుర్తుంచిపోయే చిత్రమని తెలిపాడు.
