Site icon NTV Telugu

Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..

Balakrishna

Balakrishna

నేడు నటసింహం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం. నిన్న, మొన్నటి వరకు నందమూరి బాలకృష్ణ .. నట సింహ.. అని పిలిచేవారు. కానీ ఈ సారి బర్త్ డే కి ఆయన పేరు ముందు పద్మభూషణ్ చేరింది. ఒక రకంగా 2025 లో, ఆయన 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా, కరెక్ట్ సమయంలో కేంద్రం ఆయన్ని పద్మభూషణ్ అవార్డు‌తో గౌరవించడం నిజంగా ఆనందించవలసిన విషయం. ఇక నేడు బాలయ్య బర్త్ డే కావడంతో అభిమానులు పండుగలా జరుపుకుంటారు.

Also Read : DD Next Level : ‘డీడీ నెక్ట్స్ లెవ‌ల్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇందులో భాగంగా తిరుమలలోని అఖిలాండం వద్ద బాలయ్య పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి. శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 650 కొబ్బరికాయలు పగలగొట్టి, 6.5 కిలోల కర్పూరంతో గ్రాండ్ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. ‘బాలయ్య సినిమాల‌తో పాటు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అద్భుత వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని తిరుమల వెంకన్నను ప్రార్థిస్తున్నాము’ అని తెలిపారు. ఈ వేడుకల్లో రుపేష్ వర్మ, సుబ్బు ఇతర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలయ్య జన్మదినం సందర్భంగా భక్తి, ఉత్సాహం, జోష్‌తో నిండిన ఈ ఈవెంట్ తిరుమలలో హైలైట్‌గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులకు ఈ వేడుకలు పండగలా మారాయి.

Exit mobile version