Site icon NTV Telugu

Unstoppable With NBK: బాలయ్య రచ్చ మొదలు.. సీజన్ 2 ఎప్పటినుంచి అంటే..?

Balayya

Balayya

నందమూరి బాలకృష్ణ హోస్ట్ అనగానే.. బాలయ్య ఏం మాట్లాడతాడు..? ఆ షో ప్లాప్ అవుతుంది..? ఆయన నోటి దురుసును వివాదాలు వస్తాయి..? ప్రేక్షకులను ఎలా మెప్పించగలడు..? ఇలాంటి మాటలు వినిపించాయి. వన్స్ నటసింహం రంగంలోకి దిగి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా లో మొదలైయ్యింది. మొదటి ఎపిసోడ్ అవ్వగానే అందరు అవాక్కయ్యారు. బాలయ్య ఆహార్యం, అభినయం, చతురత, వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇంకేముంది ఒక్క ఎపిసోడ్ తో చూడడం ఆపేద్దామనుకున్న ప్రేక్షకులు సీజన్ 1 ముగిసేవరకు కంటిన్యూ చేస్తూ వచ్చారు.. చివరగా సీజన్ ముగుస్తుంది అన్నప్పుడు మళ్లీ ఎప్పుడు అని అడగడంతోనే బాలయ్య హోస్ట్ గా గెలిచారు. ఈ ఒక్క టాక్ షో అంతకుముందు ఉన్న అన్ని టాక్ షో లను బీట్ చేసి నెం. 1 గా నిలిచి బాలయ్య సత్తాను చూపింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ షో సీజన్ 2 వస్తుందా..? అని ఎదురుచూసిన అభిమానులకు ఆహా వారు గుడ్ న్యూస్ తెలిపారు.

ఇటీవల బాలయ్య.. ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో కు గెస్ట్ గా వెళ్లిన విషయం విదితమే. ఇక అక్కడ ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. మధురమైన క్షణాలకు ముగింపు లేదు.. కొనసాగింపే అంటూ సీజన్ 2 కి దారి ఇచ్చేశాడు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఈ సీజన్ 2 కు సంబంధించిన అప్డేట్ ను ఆగస్టు 15 న ఇవ్వనున్నట్లు ఆహా యాజమాన్యం తెలిపింది. దీంతో అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఈ షోకు ఎవరిని పిలవాలో కింద కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. మరి ఆగస్టు 15 న ఆహా ఎలాంటి అప్డేట్ ఇవ్వనుందో చూడాలి.

Exit mobile version