నందమూరి బాలకృష్ణ అంటేనే యాక్షన్ హీరో. ఆయనకు తగ్గ దర్శకుల్లో బోయపాటి కూడా ముఖ్యమైన వారు. వీరిద్దరూ కలిస్తే జనాలకు మాస్ జాతర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘లెజెండ్’ తరువాత బాలయ్య నుంచి మరింత మాస్, యాక్షన్ మూవీని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. చాలా కాలం నుంచి బాలయ్య సినిమా నుంచి ఆశించిన ఎలిమెంట్స్ ఈరోజు ‘అఖండ’లో కన్పించాయి వారికి. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో పెరిగిపోగా, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను దాటేసింది.
Read Also : “అఖండ” ట్విట్టర్ రివ్యూ
ఇప్పటికే ‘అఖండ’ సినిమాను చూసిన వాళ్లంతా ఇదీ బాలయ్య సినిమా అంటే అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం నందమూరి అభిమానుల హడావిడే నడుస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో డల్లాస్ లో ‘అఖండ’ మాస్ జాతర జరుగుతున్నట్టుగా కన్పిస్తోంది. ఇక్కడ సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే విదేశాల్లో ప్రీమియర్ అవుతుందన్న విషయం తెలిసిందే. అలా సినిమాను వీక్షించిన డల్లాస్ నందమూరి అభిమానులు అక్కడ తమ అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఏకంగా కార్ ర్యాలీనే నిర్వహించడం విశేషం. ‘అఖండ’ మాయ మాములుగా లేదుగా !!
