Site icon NTV Telugu

RIP Mannava Balayya : సీనియర్ నటుడి మృతికి బాలకృష్ణ సంతాపం

Balakrishna

Balakrishna

ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు మన్నవ బాలయ్య ఇక లేరు. 92 ఏళ్ల వయసులో పుట్టినరోజు నాడే ఆయన తుదిశ్వాస విడవడం బాధాకరం. 1930 ఏప్రిల్ 9వ తేదీన గుంటూరు జిల్లా అమరావతి మండలం చావపాడు గ్రామంలో జన్మించిన బాలయ్య చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాలేజీ రోజుల్లో డ్రామా స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఎత్తుకు పై ఎత్తు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయగా, పార్వతీ కళ్యాణం, భాగ్యదేవత, కుంకుమ రేఖ వంటి చిత్రాలు ఆయనను నటుడిగా నిలబెట్టాయి. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. నాగార్జున మన్మధుడు, వెంకటేష్ మల్లీశ్వరితో సహా 300కు పైగా చిత్రాల్లో బాలయ్య వివిధ కీలక పాత్రల్లో నటించారు. క్యారెక్టర్ రోల్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

Read Also : Krishna Vrinda Vihari : “వెన్నెల్లో వర్షంలా”… రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసిన సామ్

ఇక బాలయ్య మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ సీనియర్ నటుడి మృతికి సంతాపం తెలియజేశారు. “సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మృతి నన్నెంతగానో తీవ్రంగా కలచివేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంత్ చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను విడుదల చేశారు. కాగా బాలకృష్ణ హీరోగా నటించిన “శ్రీరామరాజ్యం” సినిమాలోని ఓ కీలక పాత్రలో ఎం బాలయ్య కన్పించిన విషయం తెలిసిందే.

Exit mobile version