Site icon NTV Telugu

Sankranthi 2025: మళ్ళీ సంక్రాంతికి బాలయ్య vs చిరు?

Chiru Balayya

Chiru Balayya

Balakrishna and Chiranjeevi Clashing again for Sankranthi 2025: నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి పోటీ పడటం కామన్ అయిపోయింది. గత ఏడాది వీరిద్దరూ తమ వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోటీపడ్డారు. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో లేరు కానీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మరోసారి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నందమూరి బాలకృష్ణ చిరంజీవి మధ్య ఎక్కువగా సంక్రాంతి పోటీ నెలకొంటుంది. రెండుసార్లు ఇలా పోటీ పడగా రెండుసార్లు ఇద్దరూ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు 2025 సంవత్సరంలో మరోసారి పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తన 156వ సినిమా చేస్తున్నారు. ఈ రోజు వరకు ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ సంక్రాంతి సందర్భంగా విశ్వంభరా అనే టైటిల్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు.

Netflix Pandaga: నెట్ ఫ్లిక్స్ పండగో.. సంక్రాంతి రోజు 12 తెలుగు సినిమాలు!

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక బాలకృష్ణ సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తోంది. అది ఆఖండకి సీక్వెల్ అవుతుందా లేక సపరేట్ సినిమా అవుతుందా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం ఆ సినిమాని బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను స్కంద సినిమాతో డీలా పడ్డారు. దీంతో మరో హిట్టు కొట్టడానికి ఆయన అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ ఓవర్సీస్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి కనిపించడం ఖాయం అని తెలుస్తోంది.

Exit mobile version