NTV Telugu Site icon

Balagam: మొదలయ్యిందయ్యా.. ‘బలగం’ రికార్డుల మోత

Balagam

Balagam

Balagam: చిన్న సినిమా.. ఎవరు చూస్తారులే అనుకున్నారు. కామెడీ చేసే నటుడు.. డైరెక్టర్ గా మారాడట. ఏదో కామెడీ సినిమా తీస్తాడులే అనుకున్నారు. కానీ, థియేటర్ కు వెళ్లి బయటికి వచ్చాక.. ఏమన్నా తీసాడా..? అన్నారు.. ఆ తరువాత.. ఏం తీసాడురా అన్నారు.. ఆ తరువాత ఇది రా తెలంగాణ సినిమా అంటే అని అంటున్నారు. ఇంత ఇంట్రడక్షన్ చెప్పగానే ఆ సినిమా ఏంటో అర్దమైపోయి ఉంటుంది కదా.. అదే బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పల్లెటూరు కథ, ప్రతి ఒక్కరు ఈ కథకు కనెక్ట్ అవుతారు. దీంతో సినిమాకు కలక్షన్స్ తో పాటు అవార్డులు, రివార్డులు రావడం కూడా జరిగాయి.. ఈమధ్యనే నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది.

HouseOfManchus: ఛీఛీ.. దానికోసం మంచు కుటుంబం ఇంతకు దిగజారతారా..?

ఇక ఈ సినిమా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును బలగం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ.. అవార్డుల ఫోటోలను షేర్ చేశారు. ఇక వేణు సైతం తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. నా బలగానికి మూడో అవార్డు.. గ్లోబల్ స్థాయిలో బలగం అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం బలగం స్పీమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ముందు ముందు ఈ సినిమాకు ఇంకెన్ని అవార్డులు అందుతాయి చూడాలి.

Show comments