Site icon NTV Telugu

Venu Yeldandi: వెకేషన్ సరే.. నెక్స్ట్ సినిమా ఎప్పుడు.. ?

Venu

Venu

Venu Yeldandi: జబర్దస్త్ కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారాడు వేణు ఎల్దండి. బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులతో పాటు మరెన్నో అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వేణుపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి..? ఎప్పుడు మొదలవుతుంది..? ఎవరితో తీస్తున్నాడు..? అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఈ మధ్యనే వేణు ఒక కొత్త స్క్రిప్ట్ ను రాస్తున్నట్లు తెలిపాడు.

Vegetable Price: టమాటానే కాదు వీటిని కూడా కొనలేరు ఇక..

బలగం సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వేణు తన రెండో కథను ఒక స్టార్ హీరోతో చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించానుందని సమాచారం. ఇక తాజాగా ట్విట్టర్ లో వేణు కొన్ని ఫోటోలను నేను షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ డైరెక్టర్ నిలబడ్డాడు. వర్షాకాలంలో నా అద్భుతమైన రోజులు అంటూ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసినా అభిమానులు నీ వెకేషన్ సరే కొత్త సినిమా ఎప్పుడు మొదలు పెడతావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మొదటి సినిమాతో హిట్ అందుకున్న వేణు రెండో సినిమాతో ఆ విజయాన్ని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.

Exit mobile version