Balagam: ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. స్టార్ హీరోలు ఉంటే సినిమా హిట్ అవుతుంది అన్న దగ్గరనుంచి కథ ఉంటే చాలు స్టార్ హీరోలు లేకపోయినా అనే రేంజ్ కు వచ్చేశారు. అందుకే ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపిస్తున్నాయి. అలా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక మొదటి రోజు నుంచి ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. పల్లెటూరి కథలా.. తల్లిదండ్రుల కథగా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించారు. ఇక ఈ సినిమాతో రిలీజైన పెద్ద సినిమాలు కూడా బొక్క బోర్లా పడినా ఇప్పటికీ కొన్ని ఏరియాలో నిర్విరామంగా ఆడుతుంది. సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు నంది అవార్డును కూడా అందుకుంది.
Vidyut Jammwal: ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసిన హీరో.. మీకు అలవాటే కదా..?
ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలో వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి ఒక శుభవార్త. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మార్చి 24 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. భారీ ధరను పెట్టి అమెజాన్ బలగం హక్కులను కొనుగోలు చేసింది. దీంతో పాటు సింప్లీ సౌత్ ఓటిటీలో కూడా రిలీజ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ పల్లెటూరి కథను రేపటి నుంచి అమెజాన్ లో కుటుంబంతో సహా ఇంట్లోనే కూర్చొని వీక్షించండి. మరి థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.