NTV Telugu Site icon

Balagam: ఓ విశ్వక్.. ‘బలగం’ గట్టి ‘ధమ్కీ’ ఇచ్చినట్టుందే..?

Dhamki

Dhamki

Balagam: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కథలు మారాయి.. ప్రేక్షకులు మారారు. స్టార్ హీరోలు.. యాక్షన్.. ఫైట్లు .. ఇలాంటివే అని కాకుండా. చిన్న సినిమాలు.. లో బడ్జెట్ చిత్రాలు.. కథ ఉన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. దీనివలన చిన్న దర్శకులు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. భారీ విజయాన్ని అందుకుంది బలగం. జబర్దస్త్ కమెడీయన్ వేణు నుంచి డైరెక్టర్ వేణుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు వేణు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక ఈ సినిమా మార్చి 3 న రిలీజ్ అయ్యింది.. ఈ మధ్యనే ఓటిటీలో కూడా స్ట్రీమింగ్ అయ్యింది. అయినా థియేటర్ లో తన సత్తా చూపిస్తూనే ఉంది. దీని తరువాత రిలీజ్ అయిన ధమ్కీ కలక్షన్స్ కు బలగం అడ్డుకట్ట వేయడం ఆశ్చర్యమనే చెప్పాలి.

Nidhhi Agerwal: మొన్న రష్మిక.. నేడు నిధి.. ఏం చేస్తున్నావయ్యా వేణుస్వామి

విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ధమ్కీ.. మార్చి 22 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. వారం రోజులుగా ఈ సినిమాకు బలగం కూడా గట్టి పోటీ ఇస్తుంది. మొదటి రోజు రూ. 8 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసిన ధమ్కీ రోజురోజుకు తగ్గుతూ వస్తుంది అని తెలుస్తోంది. కాగా. సోమవారం రోజు బలగం కంటే తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల టాక్. విశ్వక్.. సినిమాపై మంచి ఆశలే పెట్టుకున్నారు అభిమానులు. కథ కూడా ఆ బావుండడంతో మొదటి వారం రోజులు కలక్షన్ బాగా రాబడతాయి అనుకున్నారు .. కానీ, బలగం ఇలా గట్టి పోటీ ఇస్తుందని ఎవరు అనుకోలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. ఓటిటీలో వచ్చినా కూడా చాలామంది థియేటర్ లోనే చూస్తున్నారట. ఏదిఏమైనా ఒక మంచి కథ ప్రేక్షకులు ఆదరించడం మంచి విషయమే అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.

Show comments