Site icon NTV Telugu

Bakasura Restaurant : ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతున్న చిన్న సినిమా

Br Ott

Br Ott

హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చ తెలుగు హర్రర్-కామెడీ చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కొద్దీ రోజుల క్రితం అమెజాన్ OTT ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కామెడి, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన  ఈ చిత్రం భారతదేశంలో ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న టాప్ ట్రెండింగ్ తెలుగు టైటిల్స్‌లో 4వ స్తానంలో దూసుకెళ్తోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన మూడు రోజుల కంటే తక్కువ సమయంలోనే ఈ ఫిట్ ను అందుకుంది బకాసుర రెస్టారెంట్.

Also Read : Pawan Kalyan : ‘పప్పు’ స్టూడియోలో పవన్ కళ్యాణ్.. ఏం చేస్తున్నాడంటే?

ప్రవీణ్, హర్ష చెముడు, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన బకాసుర రెస్టారెంట్ లోని కామెడీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకు తగ్గట్టే అమెజాన్ ప్రైమ్ లోని ట్రేండింగ్ లిస్ట్ లో రికార్డ్ వ్యూస్ తో టాప్ 4 లో నిలిచింది.  ప్రైమ్ వీడియో లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బకాసుర రెస్టారెంట్ తాజాగా మరొక ఓటీటీలోకి వచ్చింది. సూపర్బ్ వ్యూస్ తో దూసుకెళ్తోన్న బకాసుర ఇప్పుడు సన్ NXT ఓటీటీ లో కూడా తెలుగు మరియు తమిళం రెండింటిలోనూ ప్రసారం అవుతోంది.  ఈ నెల 13నుండి సన్ నెక్ట్స్ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. హారర్, కామెడీ ని  చిత్రాలను లైక్ చేసే ఆడియెన్స్ కు తమ చిత్రం నచ్చుతుందని యూనిట్ ప్రమోషన్స్ లో చెప్తూ వచ్చింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ రాబడుతోంది.

 

Exit mobile version