OTT : ఏకంగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చిన.. వివాదాస్పద చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం ప్రారంభంలో బోల్డ్ కంటెంట్, విభిన్న కథతో సంచలనంగా నిలిచిన తమిళ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దర్శకుడు వర్ష భరత్ తెరకెక్కించిన ఈ చిత్రానికి వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించారు. హీరోయిన్ అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా, సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి తమిళ్‌లో తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. సెప్టెంబర్‌లో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో సౌత్ ఆడియెన్స్‌కు మరింత చేరువ కానుంది.
Also Read : Bigg Boss 9: బంధాలకి ఎండ్ కార్డ్ వేసిన భరణి.. నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
‘బ్యాడ్ గర్ల్’ కథ రమ్య అనే యువతి చుట్టూ తిరుగుతుంది. సమాజం పెట్టిన అంచనాలు, నిబంధనల మధ్య తన స్వేచ్ఛను, తన వ్యక్తిత్వాన్ని కనుగొనాలనుకునే ఆ అమ్మాయి ప్రయాణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. సమకాలీన యువత ఆలోచనలను నిజాయితీగా చూపినందుకు విమర్శకులు ఈ చిత్రానికి మంచి ప్రశంసలు కురిపించారు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ పొందిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వస్తోంది. హోమ్ వ్యూయర్స్ ఈ బోల్డ్ డ్రామాకు ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది. సమాజపు ఆంక్షలపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ కథ మళ్ళీ కొత్త చర్చలకు నాంది పలుకుతుందా? వేచి చూడాలి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!