Site icon NTV Telugu

Anand Devarakonda: ‘బేబీ’ టీజర్ వచ్చేస్తోంది!

Baby

Baby

Anand Devarakonda: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సరికొత్త కథా చిత్రం ‘బేబీ’. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కె.ఎన్. నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నెల 21న ‘బేబీ’ టీజర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేయబోతున్నారు. ‘ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమని, ‘కలర్ ఫోటో’తో ఇటీవల నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్న సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించార’ని నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్. తెలిపారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించగా, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Exit mobile version