Baby Movie Makers to release 4 Hour Cut Movie in OTT: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బేబీ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలై 20 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు గంటల 55 నిమిషాల వరకు నీటితో రిలీజ్ అయింది. అయితే మరొక వర్షన్ థియేటర్లలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ చేయలేదు.
Krishna Gadu Ante Oka Range Review: కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ రివ్యూ
ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఈ సినిమా నాలుగు గంటల కట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో ఒక ఎక్స్ట్రా సాంగ్ తో పాటు కొన్ని వినసొంపైన ట్రాక్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. అలాగే వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మధ్య మరికొన్ని సీక్వెన్స్ ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య గుండెలు పిండే విధంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కలుపుతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇవన్నీ కలిపే సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అలా చేస్తే నాలుగు గంటల వరకు నిడివి వస్తుందని భయపడి కట్ చేశారు. అయితే దాదాపు 3 గంటల వరకు సినిమాని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా వాళ్ళు ఆదరిస్తున్న తీరు చూసి ఓటీటీలో అయినా పూర్తి నిడివి గల సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
