Baby Mega Cult Celebrations at Trident Hotel: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ”బేబీ” జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిసూపర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి అందమైన సినిమా నిర్మించిన సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తూ ఈ సినిమా అనునిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అయినా ఈ సినిమా కూడా ఇంకా కొన్ని థియేటర్స్ లో రన్ కొనసాగిస్తూనే ఉందంటే ఎంతలా సినిమాను ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
ఇక ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రశంసలు కురిపించగా అల్లు అర్జున్ అయితే ఒక అప్రిసియేషన్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక తాజాగా బేబీ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి బేబీ సినిమాను చూసి నన్ను, నిర్మాత ఎస్కేఎన్ ను అభినందించారు. ఈ హ్యాపీ మూమెంట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకుండా ఉండలేక పోతున్నాని అన్నారు.అయన మాట్లాడుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెబుతూ ఒక ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆయన అలా పోస్ట్ చేయడంతో బేబీ కోసం మెగాస్టార్ రాబోతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇక ఇప్పుడు ఈ బేబీ మెగా ఈవెంట్ రేపు అంటే జూలై 30న హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్..