NTV Telugu Site icon

Varun Dhawan : బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘బేబీ జాన్’

Babyjohn

Babyjohn

వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రిలీజ్ బేబీ జాన్. తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ నిర్మాణంలో కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ లో సుపర్ హిట్ గా నిలిచిన విజయ్ ‘తేరి’ సినిమాకు రీమేక్ గా వచ్చిన బేబీ జాన్ కు తెలుగు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.

Also Read : NBK 109 : డాకు మహారాజ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

‘బేబీ జాన్’ డిసెంబర్ 25న రిలీజ్ కాగా తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా బేబీ జాన్ మొదటి రోజు కేవలం రూ. 12 కోట్లు వసూలు చేయగా రెండోవ రోజు రూ. 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజులకు గాను కేవలం రూ. 25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ రూ. 80 కోట్లకు పైగా చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ. 55 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు లేవని ట్రేడ్ అంచనా వేస్తుంది. అందుకు పుష్ప -2 కూడా కారణం అని కూడా విశ్లేషిస్తుంది ట్రేడ్. బేబీ జాన్ ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు చూసేలా ఉంది. తొలిసారి నిర్మాతగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ, అలాగే కీర్తి సురేష్ కు తోలి సినిమా నిరాశపరించిందనే చెప్పాలి. మరి ఫైనల్ రన్ ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

Show comments