NTV Telugu Site icon

Baby Husband : పాపం బేబీ మొగుడుకి రియల్‌ లైఫ్‌లో దిమ్మతిరిగే షాక్..ఒకే సారి ఇద్దరితో డేటింగ్?

Krishna Mallidi News

Krishna Mallidi News

Baby Husband krishna Mallidi Had Three Breakups: బేబీ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక చోట ఆ సినిమా గురించిన చర్చా జరుగుతూనే ఉంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఆనంద్, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా మారుతీ, ఎస్కేఎన్ లు నిర్మించారు. ఇక ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శారీరికంగా దగ్గరైన వైష్ణవి చైతన్య క్లైమాక్స్‌లో మాత్రం ఆ ఇద్దరూ కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ వ్యక్తి కేవలం ఒకే ఒక షాట్ లో కనిపించినా మీమర్స్ కి మంచి స్టఫ్ అయ్యాడు. పెళ్లి చేసుకునే వారందరినీ ఆలోచింప చేసిన ఆ వ్యక్తి పేరు కృష్ణ మల్లిడి. బింబిసార డైరెక్టర్ వశిష్ట సోదరుడైన కృష్ణ డైరెక్టర్‌ అవుదామనుకుని నటుడిని అయ్యానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బేబి సినిమాలో లాగే నిజజీవితంలోనూ తనను ఒక అమ్మాయి మోసం చేసిందని తన లైఫులో లైఫ్ లో మొత్తం మూడు బ్రేకప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

Krishna Mallidi : బేబీ మగజాతి ఆణిముత్యం.. ఆ డైరెక్టర్‌ తమ్ముడంట!

బేబి సినిమాలో లాగే ఓ అమ్మాయి నన్ను మోసం చేసిందని అప్పటి నుంచే తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయిందని ఆయన చెప్పుకొచ్చాడు. తాను లవ్ చేసిన అమ్మాయి నాతో పాటు మరో అబ్బాయిని ఒకేసారి డేటింగ్‌ చేసిందని, ఈ విషయం నాకు తెలిసిన తర్వాత కూడా నేను ఆమెను వదిలేయాలనుకోలేదని అన్నారు. అందరినీ వదిలేసి నేను నీ ఒక్కదాని గురించే పిచ్చోడిలా ఆలోచించా, నా మనసంతా నువ్వే నిండిపోయావని చెప్పి అడిగితే ఆమె మరో అబ్బాయిని వదిలేయడానికి రెడీగా లేదని తెలిసి ఇద్దరితో ఉండమని బతిమాలాడాను అని అన్నారు. మూడు నెలల పాటు ఆమె నాతో, మరొకరితో ఉండడంతో ఆ టైంలో నరకం అనుభవించానని సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించిందని అన్నారు. నా భార్యగా ఊహించుకున్న అమ్మాయి మరొకరితో ఉంటుందంటే ఆ బాధ భరించలేక ఒకరోజు ఆమెను తిట్టేసి బ్రేకప్‌ చెప్పేశానని అన్నారు. అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడని ఆయన ధైర్యంతోనే మళ్ళీ మామూలు మనిషిని అయ్యాయని చెప్పాడు. ఇలా నాకు మూడు బ్రేకప్‌లు జరిగాయి అని ఈ క్రమంలో ఆయన చెప్పుకొచ్చారు.