Site icon NTV Telugu

Baby: ‘బ్రో’ వచ్చే వరకూ బేబీ సినిమాదే హవా…

Baby

Baby

జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ జనరేషన్‌కు యూత్‌కి పర్ఫెక్ట్ సినిమా… అనే రివ్యూస్ అందుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆర్‌ ఎక్స్ 100 తర్వాత యూత్‌ని అట్రాక్ట్ చేసిన సినిమాగా బేబీ ఉందంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్‌ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో అమలాపురం టు అమెరికా వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Read Also: Sharukh Khan: 200 కోట్ల బడ్జట్ ని రిలీజ్ కి ముందే రికవర్ చేసేసాడు

ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో 54 కోట్లు గ్రాస్ రాబట్టిన బేబీ, చిన్న సినిమాల్లో వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబి… మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిపొయింది. సెకండ్ వీక్ లో కూడా బేబీ జోష్ కొనసాగేలా కనిపిస్తోంది, 28న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ రిలీజ్ అయ్యే బేబీ సినిమా థియేటర్స్ కి వచ్చే నష్టం లేదు. జులై 28న బ్రో హవా మొదలయ్యే వరకూ బేబీ మూవీ జోష్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే బేబీ సినిమా ఓవరాల్ గా 65-70 కోట్ల గ్రాస్ వసూల్ చేసే ఛాన్స్ ఉంది.

Exit mobile version