Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babu Mohan: సీనియర్ కమెడియన్ బాబు మోహన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ది ప్యారడైజ్’ సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. “నాకు లుక్ టెస్ట్ చేసి, గెటప్ వేసి.. తీరా షూటింగ్ సమయానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చివరికి వాళ్లకు దరిద్రం, శని వెంటపడి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట నన్ను సంప్రదించింది. తర్వాత స్వయంగా లుక్ టెస్ట్ నిర్వహించి, గెటప్ కూడా ఫైనల్ చేశారు. ఆ టైంలో నా గెటప్ అదిరిపోయిందని పొగిడారు. షూటింగ్ మొదలయ్యాక పిలుస్తాం అని చెప్పారు. కానీ ఆ తర్వాత అటువైపు నుంచి ఎలాంటి మాటా లేదు. పిలుపు వస్తుందని నేను ఎదురుచూస్తుంటే, సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలోకి వచ్చేసింది అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు.
Also Read
ఈ వ్యవహారంపై బాబు మోహన్ కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. “బహుశా నేను వాళ్లకు పనికిరాను అనుకున్నారేమో. పరిశ్రమలో నన్ను లక్కీ హ్యాండ్‌గా భావించే దర్శకులు ఎందరో ఉన్నారు. ఈవీవీ సత్యనారాయణ గారు చెవిలో పువ్వు అని ఒక సినిమా తీశారు అందులో బాబు మోహన్ లేడు ఆ సినిమా అట్టర్ ప్లాప్, తర్వాత తీసిన ‘ప్రేమ ఖైదీ’లో బాబు మోహన్ ఉన్నాడు అది బ్లాక్‌బస్టర్. అలాంటిది నన్ను పిలిచి అవమానించి పక్కన పెట్టేసరికి, వాళ్లకు దరిద్రం వెంటాడింది. ఆ శని వల్లే సినిమా ఒక్క రోజు కూడా సరిగ్గా ఆడకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యింది” అని చెప్పుకొచ్చారు. దశాబ్దాల సినీ అనుభవం ఉన్న ఒక సీనియర్ నటుడిని పిలిపించి, లుక్ టెస్టులు చేసిన తర్వాత.. పాత్రలో మార్పు ఉంటే కనీసం ఫోన్ చేసి చెప్పే సంస్కారం కూడా సదరు దర్శకనిర్మాతలకు లేకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం బాబు మోహన్ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
-
Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..
-
Anirudh – Kavya : అనిరుధ్ సంపాదన.. కావ్య పాకెట్ మనీతో సమానమా?
-
Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!