భారతీయ సినీ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘బాహుబలి’. ఇప్పటికీ ఆ మ్యాజిక్, ఆ ఎమోషన్ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు అదే బాహుబలి సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలను కలిపి, కొత్త సన్నివేశాలు జోడించి రూపొందించిన ఈ స్పెషల్ వెర్షన్‌కు పేరు – “బాహుబలి ది ఎపిక్”. అక్టోబర్ 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక టైటిల్‌కు తగ్గట్టుగానే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట.
Also Read : Murugadoss : ఇండియన్ బాక్సాఫీస్‌పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు !
ప్రభాస్, రానాలతో ఇప్పటికే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా షూట్ చేసినట్లు టాక్ ఉంది. అనుష్క కూడా పాల్గొనబోతుందన్న వార్తలు వినిపిస్తున్న, ఆ విషయాన్ని టీమ్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ప్రస్తుతం అనుష్క హైదరాబాద్‌లో ఉన్నందున సెప్టెంబర్‌లో జరిగే ఈవెంట్స్‌లో ఆమె పాల్గొనడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. వీరితో పాటుగా రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, సుదీప్, నాజర్ తదితర తారలతో కూడా వరుస స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం షెడ్యూల్‌ను కార్తికేయ పర్యవేక్షణలో సిద్ధం చేసారని తెలుస్తోంది.
ఇక ఈ బాహుబలి ఎపిక్ రిలీజ్ కోసం అభిమానుల్లో క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. సహజంగానే దీనికి భారీ ఓపెనింగ్స్ ఖాయమని టాక్ వినిపిస్తోంది. జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూట్‌తో బిజీగా ఉన్నప్పటికీ, అక్టోబర్ రెండో వారం నుంచి పూర్తిగా బాహుబలి ప్రమోషన్లపై దృష్టి సారించనున్నాడు. ఇక నిర్మాత శోభు యార్లగడ్డ వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం గ్రాండ్‌గా ప్లాన్స్ చేస్తున్నారట. ప్రీమియర్లతో మొదలయ్యే ఈ వేడుకలు అంతర్జాతీయ స్థాయిలో జరుగనున్నాయి. ఒకవేళ ఈ “సింగిల్ పార్ట్ ఎపిక్ ఫార్ములా” సక్సెస్ అయితే, భవిష్యత్తులో పుష్ప, కెజిఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్లు కూడా ఇదే రూట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది.
