Site icon NTV Telugu

Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్.. తీసేసిన సీన్లు ఇవే.. ఫ్యాన్స్ కు షాక్

Baahubali Epic

Baahubali Epic

Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించిన అనేక విషయాలను కూడా పంచుకున్నారు. అయితే ఎడిటింగ్ లో ఏమేం తీసేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమౌళి ముందే అన్నీ చెప్పేశాడు.

Read Also : Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?

అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్‌, కన్నా నిదురించరా సాంగ్‌, యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లను తీసేశామని తెలిపాడు రాజమౌళి. యుద్ధానికి సంబంధించిన సీన్లు తీసేయడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బాహుబలి రెండు పార్టుల్లో యుద్ధాలే హైలెట్ అయ్యాయి. కానీ ఆ సీన్లనే ఎందుకు తీసేశావ్ అంటూ రాజమౌళికి ప్రశ్నలు గుప్పిస్తున్నారు అభిమానులు. ఇక రేపు ప్రీమియర్స్ ఉండటంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. డైరెక్ట్ రిలీజ్ మూవీకి వచ్చినట్టే ఈ సినిమాకు కూడా కలెక్షన్లు వస్తాయని మూవీ టీమ్ భావిస్తోంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Also : Mass Jathara : మాస్ జాతరకు బాహుబలి ఎఫెక్ట్.. తేడా వస్తే అంతే సంగతి

Exit mobile version