Site icon NTV Telugu

Baahubali : బాహుబలి రీరిలీజ్.. ఎప్పుడంటే..?

Baahubali

Baahubali

Baahubali : తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన మూవీ. ఇండియన్ మూవీ స్థాయిని పెంచేసిన సినిమా. అదే బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బాహుబలిని రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లోనే థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సారి కొత్త సీన్లు కూడా ఇందులో యాడ్ చేస్తున్నారంట. మనం చూడని కొన్ని ఎడిట్ చేసిన సీన్లతో పాటు, అన్ సీన్ ఫుటేజ్ ను చూపించబోతున్నారంట. కానీ అవేంటి అనేది ప్రస్తుతానికి ప్రకటించలేదు.
Read Also : Samantha : ఏపీలో సమంతకు గుడి కట్టేసిన అభిమాని..

ఇక్కడ మరో విషయం ఏంటంటే రెండు పార్టులను ఒకేసారి రిలీజ్ చేస్తారా.. లేదంటే మొదటి పార్టును మాత్రమే రిలీజ్ చేస్తారా అనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. మొదటి పార్టు వచ్చి పదేళ్లు గడుస్తోంది. కానీ రెండో పార్టు వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. పదేళ్లు పూర్తియిన సందర్భంగా మొదటి పార్టునే రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ స్థాయిని పెంచేసింది. ప్రభాస్ ను నేషనల్ స్టార్ ను చేసింది. రానాకు మంచి పేరు వచ్చింది. అనుష్క, తమన్నా, కీరవాణిల పేర్లు మార్మోగిపోయమాయి. ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిలో ముద్ర వేసింది. ఏదేమైనా ఈ మూవీ ఫ్యాన్స్ కు ఇది పెద్ద బిగ్ న్యూస్. అతీ గతీలేని ప్లాప్ సినిమాలను రీ రిలీజ్ చేస్తేనే థియేటర్లు ఊగిపోతున్నాయి. అలాంటిది ఇండియన్ సినిమా చరిత్రను మలుపుతిప్పిన బాహుబలి వస్తే ఇంక ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి అక్టోబర్ నెలలో అని చెప్పారు. కానీ ఏ డేట్ అనేది ఇంకా చెప్పలేదు. త్వరలోనే మళ్లీ ప్రకటించే ఛాన్స్ ఉంది.

Exit mobile version