NTV Telugu Site icon

Prabhas: బావ.. అన్ని వుడ్స్ అయిపోయాయి.. ఇక హాలీవుడ్ కు ఎంట్రీ ఇద్దామా..?

Prabhas

Prabhas

Prabhas And Rana: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 20 న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె టైటిల్, టీజర్, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్న విషయం తెల్సిందే. ఇంకోపక్క సోషల్ మీడియాలో సైతం వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అంటూ మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టరు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా టైటిల్ ను తెలుసుకుందామా..? అంతర్జాతీయ వేదికపై ప్రభాస్ ను ఎప్పుడు చూస్తామా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అంతలోపే ఈ సినిమా కోసం మరో స్టార్ హీరోను రంగంలోకి దించేశారు మేకర్స్.. ఆ హీరో ఎవరో కాదు మన భల్లాలదేవుడు రానా దగ్గుబాటి. ప్రభాస్, రానా కాంబోలో వచ్చిన బాహుబలి.. వీరిని పాన్ ఇండియా స్టార్స్ గా మార్చేసింది.ఆ సినిమా నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

Prem Kumar Trailer: పెళ్లిళ్లు చెడగొట్టడంలో పీకే స్పెషలిస్ట్..

ఇకపోతే ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో రానా కూడా భాగం అయ్యాడు. ఇప్పటికే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ కోసం ప్రభాస్, రానా అమెరికా చేరుకున్నారు. ఇద్దరు అమెరికా వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను మేకర్స్ షేర్ చేశారు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె టీ షర్ట్స్ వేసుకొని ఇద్దరూ.. హాలీవుడ్ అని రాసి ఉన్న బోర్డు వైపు తదేకంగా చూస్తూ కనిపించారు. దీంతో అభిమానులు ఈ ఫొటోకు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ .. హాలీవుడ్ మీద కన్నేశాడు అని కొందరు.. బావ.. అన్ని వుడ్స్ అయిపోయాయి.. ఇక హాలీవుడ్ కు ఎంట్రీ ఇద్దామా..? అని ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments