Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?

Prabhas

Prabhas

భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క స్వయంగా ‘బాహుబలి 3’ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుందనే.. విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ‘బాహుబలి 3’ అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాహుబలి థర్డ్ పార్ట్ గురించే చర్చ జరుగుతోంది. మరి బాహుబలి 3 ఇప్పట్లో సాధ్యమేనా? అంటే, అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రభాస్ ముందు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ కావడానికి కనీసం రెండేళ్లైనా పడుతుంది. మరోవైపు రాజమౌళి, మహేష్‌ బాబు వారణాసితో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడింది. దీని తర్వాత రాజమౌళి స్టెప్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ బాహుబలి 3 ఆలోచన చేస్తే.. ప్రభాస్ అప్పటికి కాస్త ఫ్రీ అవుతాడు కాబట్టి ఉండే ఛాన్స్ ఉంది. కానీ, రానా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అనుష్క పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. మిగతా క్యాస్టింగ్‌ను సెట్ చేయడం అంత ఈజీ కాదు. ఈ లెక్కన చూస్తే.. బాహుబలి 3 ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం ఈ అనౌన్స్మెంట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. మరి రాజమౌళి ప్లాన్ ఏంటో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!