Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క స్వయంగా ‘బాహుబలి 3’ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుందనే.. విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ‘బాహుబలి 3’ అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాహుబలి థర్డ్ పార్ట్ గురించే చర్చ జరుగుతోంది. మరి బాహుబలి 3 ఇప్పట్లో సాధ్యమేనా? అంటే, అసాధ్యంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రభాస్ ముందు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ కావడానికి కనీసం రెండేళ్లైనా పడుతుంది. మరోవైపు రాజమౌళి, మహేష్ బాబు వారణాసితో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడింది. దీని తర్వాత రాజమౌళి స్టెప్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ బాహుబలి 3 ఆలోచన చేస్తే.. ప్రభాస్ అప్పటికి కాస్త ఫ్రీ అవుతాడు కాబట్టి ఉండే ఛాన్స్ ఉంది. కానీ, రానా పెద్దగా సినిమాలు చేయడం లేదు. అనుష్క పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. మిగతా క్యాస్టింగ్‌ను సెట్ చేయడం అంత ఈజీ కాదు. ఈ లెక్కన చూస్తే.. బాహుబలి 3 ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం ఈ అనౌన్స్మెంట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. మరి రాజమౌళి ప్లాన్ ఏంటో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!