Site icon NTV Telugu

GOG : మోత మోగించేస్తున్న అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్.. చూశారా?

Ayesha Khan Motha Song

Ayesha Khan Motha Song

Ayesha Khan Motha Song from Vishwak Sen’s Gangs of Godavari out: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మాస్ ని మెప్పించే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే బయటకొచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ వచ్చేసింది. ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం ఇప్పుడు ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న క్రమంలో ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుండి విడుదలైన ”సుట్టంలా సూసి” మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో దాదాపు 50 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా నుండి “మోత” అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేసింది. అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఉన్న ఈ పాట.. థియేటర్లలో మోత మోగించడం ఖాయం అనేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం ఈ పాటని మరోస్థాయికి తీసుకెళ్లింది. పాట సందర్భానికి తగ్గట్టుగా పదాల అల్లికతో మరోసారి మాయ చేశారు.

Tapsee: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్?

అలాగే ఎం.ఎం. మానసి గాత్రం ఈ గీతానికి మరింత అందం తీసుకొచ్చింది. హోలీ రోజున “మోత” పాటను విడుదల చేసి, పండగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది చిత్ర బృందం. ఇక అందాల తార అయేషా ఖాన్ ఈ ప్రత్యేక పాట కోసం విశ్వక్ సేన్‌తో కలిసి తెరను పంచుకోగా ఆమెను స్క్రీన్ మీద చూసిన వారంతా నిజంగా మోత మోగించేసింది రా బాబూ అంటున్నారు. ఎందుకంటే అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుందని పాట వింటే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మే 17, 2024న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Exit mobile version