Ayalaan : జనవరి 26న తెలుగులో ‘అయలాన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayalaan Telulgu to Release rom January 26th: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. తమిళనాడులో ‘అయలాన్’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లో రూ .50 కోట్లు కలెక్ట్ చేసింది.
Raja Saab: ప్రభాస్ సినిమా ప్లాట్ లీక్ చేసిన ఐఎండీబీ.. అరెరే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా మరి.
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ వారంలో వంద కోట్ల మార్క్ చేరువ కానుంది. శివ కార్తికేయన్ నటనతో పాటు కామెడీ, సినిమా కాన్సెప్ట్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ ”హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా భారతీయ ప్రేక్షకులకు అందించాలని క్వాలిటీ విషయంలో మీ టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ ప్రేక్షకుల ఆదరణ చూశాక మా కష్టాన్ని మర్చిపోయాం. అంత సంతోషంగా ఉంది అన్నారు. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం” అని చెప్పారు. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?