Site icon NTV Telugu

Award winning Director: ‘సర్కిల్’ చుడుతున్న నీలకంఠ!

Neelakanta

Neelakanta

Circle: మోస్ట్ టాలెంటెడ్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. గతంలో ‘షో’ అనే సినిమాతో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలానే ‘షో’, ‘విరోధి’ చిత్రాలు ఇండియన్ పనోరమలో కూడ సెలెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత నీలకంఠ కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న “మిస్సమ్మ, సదా మీ సేవలో” వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ‘సర్కిల్’ అనే చిత్రంతో నీలకంఠ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో అనే ట్యాగ్ లైన్ పెట్టారు.


తాజాగా ‘సర్కిల్’ మూవీ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్ ఫోటో కెమెరా లెన్స్ తిరుగుతుండగా.. దానితో పాటు ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో అనే ట్యాగ్ తో ఎండ్ అవుతుందీ మోషన్ పోస్టర్. ఇది నీలకంఠ తరహాలోనే సాగే వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ ‘సర్కిల్’ చిత్రంలో నటీనటులు సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనయ్, నైనా, పార్థవ సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎన్. ఎస్. ప్రశు సంగీతాన్ని సమకూర్చగా, రంగనాథ్ గోగినేని సినిమాటోగ్రఫీ అందించారు. ఎమ్. వి. శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version