ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉండే బోల్డ్ బ్యూటీలో అవ్‌నీత్ కౌర్ ఒకరు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ పోజులిస్తూ తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఆమె లైఫ్ ఇంతలా టర్క్ అవ్వడానికి విరాట్ కోహ్లి కారణం అనే విషయం తెలిసిందే. ఆయన నుంచి అవ్‌నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ ఫొటో పోస్టుకు పొరపాటున లైక్ నమోదైంది. దీంతో అవ్‌నీత్ లైఫ్ మారిపోయింది. ఈ ఘటన తర్వాత ఆమెకు కొత్తగా 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్లు లభించగా, 12 బ్రాండ్లకు సైన్ చేశారు. దీంతో విరాట్ పై ట్రోల్స్ కూడా వచ్చాయి.
Also Read : Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే
కానీ ఈ వివాదానికి తెరదించుతూ ‘నా ఫీడ్ ను క్లియర్ చేసేటప్పుడు అల్గారిథం పొరపాటున ఇంటరాక్షన్ ను నమోదు చేసినట్లు అనిపిస్తుంది. దాని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసర ఊహాగానాలు చేయొద్దని కోరుతున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలు’ అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఈ లైక్ పై తాజాగా అవ్‌నీత్ రియాక్టయింది. అవ్‌నీత్ కౌర్ తన అప్ కమ్మింగ్ ‘లవ్ ఇన్ వియత్నాం’ మూవీ ప్రమోట్ లో భాగంగా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విరాట్ లైక్ గురించి మాట్లాడుతూ, చిరునవ్వుతో ఇలా అన్నారు.. ‘మిల్తా రహే ప్యార్.. ఔర్ క్యా హి కేహ్ సక్తి హూ (ప్రేమ దొరుకుతూనే ఉండాలి నేను ఇంతకంటే ఏం చెప్పగలను)’ అని పేర్కొంది. ప్రజంట్ ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
