Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా ఫేమస్ అయింది అవికాగోర్. పెద్దయ్యాక సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. కానీ బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. ఇలాంటి టైమ్ లో తన పెళ్లి డేట్ ను కన్ఫర్మ్ చేసింది. సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో ఆమె కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈ జంట తమ పెళ్లి డేట్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Bigg Boss 9 : మూడో వారం నామినేషన్స్ లో ఉన్నది వీరే..
వీరిద్దరూ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ లో వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. 2020 నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. 2019లో ఓ ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను అవికా కలిసింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. 2020 వచ్చేసరికి ఇద్దరి మధ్య డేటింగ్ మొదలైంది. ఐదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో ఈ జంటకు అంతా విషెస్ చెబుతున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఎక్కడికి పోతావ్ చిన్నవాడా లాంటి సినిమాలతో పాపులర్ అయింది.
Read Also : Bigg Boss : రీతూ చౌదరికి భారీ షాక్ ఇవ్వనున్న నాగార్జున..?
