Site icon NTV Telugu

Tarot : హాలీవుడ్ హర్రర్ మూవీలో అవంతిక వందనపు..ఆకట్టుకుంటున్న’టారో’ ట్రైలర్..

Whatsapp Image 2024 02 01 At 2.41.15 Pm

Whatsapp Image 2024 02 01 At 2.41.15 Pm

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు.. తన క్యూట్ స్మైల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా హాలీవుడ్లో కనిపించి అవంతిక అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇప్పటికే ‘మీన్ గర్ల్స్’ అనే సిరీస్ లో కనిపించి హాలీవుడ్ లో పాపులర్ అయిపోయింది అవంతిక. ఇంతలోనే తను నటించిన మరో హాలీవుడ్ మూవీ ‘టారో’ (Tarot) కూడా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ‘టారో’ఒక హారర్ మూవీ. ఇప్పటికే హాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అవంతిక.. ఇలాంటి ఒక హారర్ మూవీలో నటిస్తుంది అనే విషయం మరోసారి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.2024 మే 10న ‘టారో’ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అవంతిక వందనపు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ‘సోనీ పిక్చర్స్ నుండి వస్తున్న ‘టారో’ మే నుండి థియేటర్లలోకి రానుంది. మీ విధి ఈ కార్డ్స్ లో ఉంది’ అంటూ అవంతిక ‘టారో’ నుండి తన క్యారెక్టర్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ట్రైలర్ ను గమనిస్తే కొందరు స్నేహితులు కలిసి ‘టారో’ కార్డ్స్ తో తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో ఆ కార్డ్స్ కు సంబంధించిన రూల్స్ ని అతిక్రమిస్తారు. దీంతో ఆ కార్డ్స్ లో ట్రాప్ అయ్యి ఉన్న దెయ్యాన్ని బయటికి తీసుకొస్తారు. దాని వల్ల ఒకరి తర్వాత ఒకరుగా దారుణంగా చనిపోతూ ఉంటారు.టైటిల్ మరియు ట్రైలర్ ని బట్టి చూస్తే ‘టారో’ కార్డ్స్ వల్లే సమస్యలు మొదలవుతాయని స్పష్టమవుతోంది. హారియెట్ స్లాటర్, అడైన్ బ్రాడ్లే, అవంతిక మరియు జాకోబ్ బాటలాన్ వంటి నటీనటులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. స్పెన్సర్ కోహెన్, ఆన్నా హాల్బెర్గ్ కలిసి ఈ హారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. లెస్లీ మార్గెన్స్టెయిన్, ఎలిసా కాప్లోవిట్జ్ డటన్ మరియు స్కాట్ గ్లాస్గోల్డ్ ‘టారో’కు నిర్మాతలుగా వ్యవహరించారు. సోనీ పిక్చర్స్ ఈ సినిమాను భారీ ఎత్తులో విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

Exit mobile version