Site icon NTV Telugu

ZEE : ఆటో విజయశాంతి వస్తుంది.. త్వరగా ఎక్కండి

Zee

Zee

అదిరిపోయేట్విస్ట్లతో సాగేసీరియళ్లను అందిస్తున్న జీతెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్  అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునేకథ, కథనంప్రేక్షకులను అలరించేందుకు జీతెలుగు అందిస్తున్నసరికొత్త ధారావాహిక ‘ఆటో విజయశాంతి’. కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘ఆటో విజయశాంతి’ జులై 7న ప్రారంభం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, మీ జీ తెలుగులో!

ఆటో విజయశాంతి సీరియల్ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందుతోంది. చెల్లెళ్లను ప్రేమగా పెంచుకునే రజినీకాంత్(అలీ రెజా) ఓ ప్రమాదంలో చనిపోవడంతో కథ మొదలవుతుంది. అన్న బాధ్యతలను నెరవేర్చేందుకు ఆటో డ్రైవర్గా మారుతుంది విజయశాంతి(వర్షిణి). అన్న చావుకి కారణమైన వాళ్లపై పగ సాధించాలనుకుంటుంది దుర్గ(సాండ్ర). అనుకోకుండా విజయశాంతి జీవితంలోకి వస్తాడు చిరంజీవి(స్వామి). తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేమకు నోచుకోని చిరంజీవి, విజయశాంతి మనసు ఎలా గెలుస్తాడు? తన అన్న చావుకి ప్రతీకారం తీర్చుకునేందుకుదుర్గ ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే ఆటో విజయశాంతి సీరియల్ని తప్పకుండా చూడండి!

కుటుంబ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ధారావాహికలో స్వామి, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అలీ రెజా, సాండ్ర, సంధ్య, రాజేష్, నిహాల్, మహర్షి రాఘవ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కుతున్న ఆటో విజయశాంతి సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు సిద్ధమైంది. అద్భుతమైన కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో సాగే ఆటో విజయశాంతి సీరియల్ మీరూ తప్పక చూడండి!

Exit mobile version