మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ చేస్తున్న ఈ సినిమా చాలా డిలే అవుతోంది. శంకర్ లాంటి దర్శకులని సినిమా ఎన్ని రోజుల్లో అయిపోతుంది, రిలీజ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని అడగలేం అంటూ దిల్ రాజు క్లియర్ గా చెప్పేసాడు. 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గేమ్ ఛేంజర్ కంప్లీట్ షూటింగ్ అయిపోయాకే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఈలోపు రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చెయ్యడానికి బుచ్చిబాబు సన ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ని చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు.
Read Also: Extra Ordinary Man Review : ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ
ఒక విలేజ్ కథని గ్లోబల్ గా చెప్తాను అంటూ అనౌన్స్మెంట్ నుంచే బుచ్చిబాబు సన RC16 సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ప్రీవర్క్స్ ని స్పీడప్ చేసిన బుచ్చిబాబు సన, ఆడిషన్ కాల్ కి పిలుపునిచ్చాడు. రామ్ చరణ్ తో కలిసి RC16లో నటించే అవకాశం మీకోసం అంటూ… అన్ని వయసుల ఆర్టిస్టులు కావాలని ఆడిషన్ కాల్ ఇచ్చారు. ఉత్తరాంధ్రా యాసలో తెలుగు మాట్లాడగలిగి యాక్టింగ్ వస్తే చాలు ఏ వయసు వాళ్లైనా ఆడియన్స్ కి అప్లై చెయ్యొచ్చు. ఒక యాక్టింగ్ వీడియో, మూడు ఫోటోలని rc16bb.casting@gmail.com కి మెయిల్ చేసేయండి రామ్ చరణ్ తో నటించే అవకాశం పెట్టేయండి. మరి ఈ ఆడియన్స్ కాల్ నుంచి ఎంతమంది కొత్త వాళ్లు సినిమాలో కనిపిస్తారు అనేది చూడాలి.
Call for Audition… pic.twitter.com/S8HPRmMV1c
— BuchiBabuSana (@BuchiBabuSana) December 8, 2023
