సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన ‘ఆత్రంగి రే’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆత్రంగి రే’ క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా ప్రత్యేకంగా చూపించారు.
‘ఆత్రంగి రే’ 3 నిమిషాల 8 సెకన్ల ట్రైలర్ లో సారా అలీ ఖాన్ (రింకు సూర్యవంశీ)ని వివాహం చేసుకున్న ధనుష్ (విషు)ని కొంతమంది కిడ్నాప్ చేయడంతో ప్రారంభమవుతుంది. విషు తమిళుడు. అతన్ని పెళ్లి చేసుకోవడం సారాకు ఇష్టం లేదు.
రింకూ, విషూ బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఢిల్లీ చేరుకున్న తర్వాత ఇద్దరూ తమ దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రింకూ సర్కస్‌లో పనిచేసే మాంత్రికుడు అక్షయ్ కుమార్ (షెహజాద్)తో ప్రేమలో ఉంటుంది. అయితే షెహజాద్ లో ప్రేమలో ఉన్నప్పటికీ చివరికి రింకూ, విషూ ఒకరినొకరు ప్రేమిస్తారు. మరి ఈ ట్రయాంగిల్ ప్రేమ కథకు ముగింపు ఏంటన్నది సినిమా రిలీజ్‌తోనే తెలుస్తుంది.
Read also : పెళ్ళికి ముందు కత్రినా, విక్కీ కోర్టు మ్యారేజ్… ఇలా ఎందుకో తెలుసా ?
సినిమాలో ఫుల్ డ్రామా, పాటలు, రొమాన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. సారా, ధనుష్‌ల జోడీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ ఎంట్రీ కూడా ట్రైలర్‌లో చాలా భిన్నంగా కనిపించింది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
