Site icon NTV Telugu

Athiradi : ‘అతిరథి’ టైటిల్ టీజర్ అవుట్.. టొవినో, బేసిల్ జోసెఫ్‌ల నుంచి సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్ రెడీ !

Athiradi Title Teaser Out

Athiradi Title Teaser Out

మలయాళ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటులు టోవినో థామస్, బేసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ మరోసారి కలిసి మాస్ మాయాజాలం చూపించబోతున్నారు. వీరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అతిరథి’ (Athiradi). ఈ సినిమాకు అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహిస్తుండగా, బేసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, డాక్టర్ అనంత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ అనంత్, బేసిల్ జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Amala : వాళ్ళు ఇద్దరూ చాలా బిజీ.. తన కోడల‌పై అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ విడుదలైంది.. టీజర్ చూస్తుంటేనే ఇది ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. అడవిలో మంటలు చెలరేగినట్టుగా ఓ హీరోని, సుడిగాలి లా దూసుకెళ్లే మరో హీరో ని చూపిస్తూ వినీత్ శ్రీనివాసన్ ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్స్ థియేటర్ ఫీల్ ఇచ్చేశాయి. కథ వివరాలను ఎక్కువగా రివీల్ చేయకపోయినా, మేకర్స్ చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపాయి.

టొవినో, బేసిల్ కాంబినేషన్ అంటేనే మలయాళ సినీ అభిమానుల్లో స్పెషల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. గతంలో వీరిద్దరూ చేసిన సినిమాలు మంచి రివ్యూలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అతిరథి’ తో మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. చిత్రబృందం తెలిపిన ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన ప్యూర్ మాస్ ట్రాక్‌పై ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. టీజర్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో, ‘అతిరథి’పై అంచనాలు బాగా పెరిగాయి.

 

Exit mobile version