Site icon NTV Telugu

Atharva: మర్డర్ మిస్టరీ చుట్టూ ‘అథర్వ’

Atharva Trailer

Atharva Trailer

Atharva Movie Trailer: ఈ మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మౌత్ టాక్ బాగుంటే ఇలాంటి సినిమాలు ఆడుతున్న క్రమంలో మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చే ఈ తరహా సినిమాలకి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోండగా ఇప్పుడు మరో సినిమా కూడా వచ్చేస్తోంది. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అథర్వ’ సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.

Sumanth: పవన్ పై అభిమానం.. వారాహి పేరుతో సుమంత్ కొత్త సినిమా

టాలీవుడ్‌ హీరోయిన్ జ్యోస్ని హుపారికర్ హత్యకు గురైంది, అయితే ఆమెతోపాటు సిటీలో మరో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయి సార్‌ అంటూ సాగే సంభాషణలతో మొదలయింది ట్రైలర్‌. ఈ హత్యలను అథర్వ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్‌. అతి కిరాతకమైన క్రిమినల్ కేసులను చేధించేందుకు అథర్వ రెడీ అవుతున్నట్టు హింట్ ఇచ్చాడు డైరెక్టర్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రింగా రింగా రోజే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోండగా ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను మించి థ్రిల్‌ ను కలిగించేలా.. ఉత్కంఠ రేకెత్తించే స్టోరీ, స్రీన్‌ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తుండగా డిసెంబర్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Exit mobile version