Site icon NTV Telugu

Venu Swamy: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి నటించిన సినిమా ఏంటో తెలుసా?

Venuswamy

Venuswamy

Venu Swamy Acted in Jagapathi Movie: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం లోకి వచ్చారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి వారి జాతకాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిపోతున్నారు. అయితే వేణు స్వామి తాను గతంలో ఎన్నో సినిమాలకు పని చేశానని ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టడం దగ్గర నుంచి కొన్ని సినిమాలకు ప్రొడక్షన్లో కూడా పని చేశానని చెబుతూ ఉంటారు.

Kalyan Ram: తారక్, నేను.. TDP గురించి ఆలోచించే టైం ఇప్పుడు లేదు!

అయితే ఆయన నిజంగా పనిచేశారో లేదో తెలియదు కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఈ విషయం ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో అయితే అర్థమవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభాస్ కెరియర్ అయిపోయిందంటూ కామెంట్స్ చేసి సలార్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఆయన నటించిన సినిమాకి సంబంధించిన ఒక క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేణు స్వామి జగపతిబాబు హీరోగా నటించిన జగపతి అనే సినిమాలో అర్చక స్వామి పాత్రలో నటించాడు. అందులో హీరోయిన్ రక్షిత-జగపతి బాబు కాంబినేషన్ లో వేణు స్వామి కనిపించారు. ఆయనకి రెండు డైలాగులు కూడా ఉన్నాయి. అంతే కాదండోయ్ త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడులో కూడా వేణు స్వామి ఉన్నారట. ఒక సాంగ్ లో ఆయన ఉన్నారని తెలుస్తోంది.

Exit mobile version