ఆ పనికి అమ్మాయిలే కాదు ట్రాన్స్ జెండర్స్ అయినా పర్లేదు- స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున తో ‘మన్మధుడు 2’ చిత్రం తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ డైరెక్టర్ గా మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నట్లు రాహుల్ ఇటీవల తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ప్రాధాన్యం అని తెలిపాడు. ” నా తదుపరి ప్రాజెక్ట్ కి మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాను.. మహిళలకు సమాన హక్కు కల్పించాలని నా ఉద్దేశ్యం.. ఇంట్రెస్ట్ ఉన్నవారు , హార్డ్ వర్క్ చేయగలను అనుకున్నవారు నా మెయిల్ కి సీవీ పంపించాల్సిందిగా కోరుతున్నాను”.అని తెలిపాడు.
అంతేకాకుండా కేవలం మహిళలే కాకుండా ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఈ అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చాడు. వారికి ఒక భరోసా కూడా ఇచ్చాడు. ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ జెండర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయితే వారికి గౌరవమైన వృత్తిని, మంచి గౌరవమైన వాతావరణాన్ని కల్పిస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ అరుదైన అవకాశాన్ని ఎవరు అందుకుంటారో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Also Read
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
- Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
Interested transgender candidates are also welcome to apply. If hired, I assure you a respectful work environment. https://t.co/ttf2u8PaEl
— Rahul Ravindran (@23_rahulr) November 30, 2021
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!