NTV Telugu Site icon

Asian Vaishnavi: మొన్నటిదాకా థియేటర్ వార్.. ఇప్పుడు కలిసి ఓపెనింగ్?

Hanuman Opening

Hanuman Opening

Asian Vaishnavi Multiplex to be launched by Hanuman Team: ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ కూడా విజయవంతంగా చేస్తోంది ఏషియన్ సినిమాస్ సంస్థ. అలాగే డిస్టిబ్యూషన్ చేస్తూ మరొక పక్క కొత్త కొత్త మల్టీప్లెక్స్ లను లాంచ్ చేస్తూ వెళ్తోంది. ఇప్పటికే ఏషియన్ మహేష్ బాబు థియేటర్, ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ తో పాటు ఏషియన్ విజయ్ దేవరకొండ థియేటర్లను కూడా ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పుడు ఏషియన్ వైష్ణవి(వైష్ణవి నారంగ్) పేరుతో ఒకసారి కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మించడమే కాదు ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధమైంది. పటాన్చెరు దగ్గరలోని రామచంద్రపురం డి మార్ట్ దగ్గరలో ఈ కొత్త ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ రేపు గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా హనుమాన్ టీం హాజరు కాబోతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, హీరో హీరోయిన్లు తేజ సజ్జ, అమృత అయ్యర్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

Sundeep Kishan: రికార్డ్ సృష్టించిన ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్

అదేవిధంగా నిర్మాతలు సురేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూసుకుంటున్న శశి కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఫోటో కూడా వేసి ఆయన నుంచి బెస్ట్ విషెస్ ఉన్నాయని అని పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. హనుమాన్ సినిమాకి థియేటర్ల కేటాయింపు విషయంలో దిల్ రాజు కాంపౌండ్ కి మైత్రి మూవీ మేకర్స్ కి కాస్త దూరం పెరిగినట్లు మీడియాలో సోషల్ మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే ఆసక్తికరంగా రేపు ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి వీరందరూ హాజరు కాబోతున్నారు అనే వార్త ఆసక్తికరంగా ఉంది.