కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ పక్కనే ఉన్న ‘తారక రామ’ థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్. స్వయంగా ఎన్టీఆర్ నిర్మించిన ఈ థియేటర్ కాచీగూడ సెంటర్ లో ఎన్నో హిట్ సినిమాలకి ఆస్థానం అయ్యింది. కాలం మారుతున్న సమయంలో సరైన ఫెసిలిటీస్ లేక చిన్న సినిమాలు, బూతు సినిమాలు ఈ థియేటర్ లో ప్లే అవ్వడంతో ‘తారకరామా’ ఒకప్పటి కళని కోల్పోయింది. క్రమంగా ఆడియన్స్ కి మల్టీప్లెక్స్ లకి అలవాటు పడడంతో ‘తారకరామా’ థియేటర్ కి వచ్చే ఆడియన్స్ పూర్తిగా తగ్గిపోయారు. దీంతో కరోన సమయంలో ‘తారకరామా’ థియేటర్ పూర్తిగా మూతపడింది.
రెండేళ్లుగా మూతపడిన ‘తారకరామా థియేటర్’కి కొత్త హంగులు అడ్డుతున్నారు. ఈ థియేటర్ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్ చైన్స్ లో ఒకటైన ‘ఏషియన్’తో కలిసి ‘ఏషియన్ తారకరామా’గా మళ్లీ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. నారాయణదాస్ నారంగ్, సునీల్ భరత్ నారంగ్, సురేష్ బాబు కలయికలో అధునాతనంగా మారనుంది. అత్యాధునిక 4క్ టెక్నాలజీతో, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెనోవేట్ అయిన ‘ఏషియన్ తారకరామా థియేటర్’ ఓపెనింగ్ డిసెంబర్ 14న గ్రాండ్ గా జరగనుంది. ఈ ఐకానిక్ థియేటర్ ఓపెనింగ్ కి బాలయ్య చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. అయితే గతంలో 975 ఉన్న సీటింగ్ కెపాసిటీని బాగా తగ్గించి 590 చేశారు.